![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -373 లో.. రాజ్ అన్న మాటలు ఇందిరాదేవి గుర్తుకుచేసుకొని బాధపడుతుంటే.. అప్పుడే కావ్య వచ్చి ఏం ఆలోచిస్తున్నారని అడుగుతుంది. రాజ్ బాబుని తీసుకొని ఆఫీస్ కి వెళ్ళాడు కదా.. దాంతో ఇంట్లో పెద్ద గొడవనే జరిగిందని ఇందిరాదేవి చెప్తుంది. నాకు తెలుసు అలా జరుగుతుంది అని కావ్య అనగానే.. తెలిసినప్పుడు ప్రొదున్నే ఆపొచ్చు కదా అని ఇందిరాదేవి అడుగుతుంది. మీ మనవడు చెప్తే వినే రకం కాదు కదా అని కావ్య అంటుంది.
ఆ తర్వాత సుభాష్ దగ్గరికి రాజ్ వచ్చి.. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసాను. ఇప్పుడు ఆఫీస్ బాధ్యతల నుండి తప్పుకున్నాను. మరి ఆ బాధ్యతలు ఎవరికివ్వాలనుకుంటున్నారని రాజ్ అడుగుతాడు. కళ్యాణ్ కి అలాంటి వాటిపై ఇంట్రస్ట్ లేదు వాన్ని నేను ఎండీ చైర్ లో కూర్చోమని అడగలేను .. ఇక రాహుల్ విషయానికి వస్తే వాడికి రెస్పాన్సిబిలిటీ లేదని రాజ్ అంటాడు. ఇప్పుడు ఎండీ బాధ్యతలు తీసుకొనే సామర్థ్యం ఉన్నవారు ఒకే ఒక్కరు అని రాజ్ అనగానే.. ఎవరని సుభాష్ అడుగుతాడు. కావ్య అని రాజ్ చెప్తాడు. తెలివితేటలు లీడర్ షిప్ లక్షణాలు అన్నీ ఉన్నాయని రాజ్ చెప్తాడు. నాకు ఇష్టమే కానీ మీరు, అమ్మ ఒప్పుకోదని సుభాష్ అంటాడు.. మీరు ఎలాగైనా మమ్మీ ని ఒప్పించండని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఎండీ బాధ్యతల నుండి తప్పుకున్నారంట? ఎందుకు ఇలా అన్నీ వదిలేసుకుంటున్నారని రాజ్ పై కావ్య కోప్పడుతుంది.
ఇక రాజ్ ఎండీ పదవి నుండి తప్పుకున్నాడు.. కళ్యాణ్ ని ఎండీనీ చేయమని అడుగని అనామికని రుద్రాణి రెచ్చగొట్టి పంపిస్తుంది. ఇప్పుడు అనామిక వెళ్లి అడుగుతుంది.. నిన్ను ఎండీ చెయ్యమని స్వప్న వెళ్లి అడిగేలా స్వప్నకి వినపడడేలా అనామిక తన భర్త కోసం ఎండీ పదవి కావాలని అడుగుతుందంటూ మాట్లాడుకుంటార. ఆ మాటలు విని స్వప్న కూడా రాహుల్ కు బాధ్యతలు ఇవ్వమని అడగాలని అనుకుంటుంది. కాసేపటికి కళ్యాణ్ కి ఎండీ పదవి ఇవ్వాలని సీతారామయ్యని అనామిక అడుగుతుంది. రాహుల్ కి ఇవ్వాలని స్వప్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |